ఇరాన్‌లో భూకంపం
న్యూక్లియర్‌ప్లాంట్‌కు తప్పిన ముప్పు
తెహ్రాన్,డిసెంబర్27(జనంసాక్షి): ఇరాన్‌లోని బుషెహ్ర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు సవిూపంలో శుక్రవారం ఉదయం 5:23 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. బుషెహ్ర్ కు తూర్పు దిశలో 53 కిలోవిూటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే భూకంపం నేపథ్యంలో ఎలాంటి నష్టం జరగలేదని ఇరాన్ విూడియా వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5కు పైగా నమోదైతే గణనీయమైన నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కానీ బుషెహ్ర్ న్యూక్లియర్ ప్లాంట్ చాలా బలమైన భూకంపాలను తట్టుకునేలా రూపొందించబడింది. ఇరాన్‌లోని చారిత్రాత్మక నగరమైన బామ్‌లో 2006లో భూకంపం వచ్చింది. 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపానికి 26 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బామ్ నగరం బుషెహ్ర్ ప్లాంట్‌కు దగ్గరగా ఉన్నప్పటికీ నాడు ఎలాంటి దెబ్బతినలేదు.