ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు లేవు

5

హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌

ఏడాది పాలనపై కేంద్రానికి గవర్నర్‌ నివేదిక

ఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మధ్య ఎలాంటి విబేదాలు లేవని హస్తినలో గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రానికి స్పష్టంచేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు. ఢిల్లీలో గవర్నర్‌ పలువురు పెద్దలతో భేటీ ఆయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో గవర్నర్‌ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన పలు అంశాల పురోగతిపై చర్చించినట్లు సమాచారం. అనంతరం ప్రధానితో నరసింహన్‌ సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిణామాలను మోడీకి గవర్నర్‌ వివరించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఓటుకు నోటు వ్యవహారం, హైదరాబాద్‌లో గవర్నర్‌ అధికారాలపై ప్రధాని ఆరా తీసినట్లు సమాచారం.

ఇక మరోవైపు ఏపీ ప్రతిపక్షనేత జగన్‌ హస్తినలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లతో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల్లోనెలకొన్న పరిస్థితులను కేంద్రమంత్రులకు జగన్‌ వివరించారు. ఓటుకు నోటు వ్యవహారంలో బాబును ఎ-1 ముద్దాయిగా చేర్చాలని వైసీపీ బృందం విజ్ఞప్తి చేసింది. అవినీతి ముఖ్యమంత్రిని కేంద్రం కాపాడుతుందని తాను భావించడం లేదన్నారు జగన్‌. అనంతరం ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీతో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా కల్పించాలంటూ డిమాండ్‌ చేశారు. అలాగే చంద్రబాబు వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.