ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చండి

5

హైదరాబాద్‌, 26 జూన్‌ (జనంసాక్షి):

కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో తెలుగు రాష్గాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ భేటీ ముగిసింది. సెక్షన్‌-8, తెలుగు రాష్గాల్లోని తాజా పరిస్థితులపై రాజ్‌నాథ్‌సింగ్‌తో గవర్నర్‌ చర్చించినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య సయోద్య కుదర్చలని కేంద్రం గవర్నకు సూచించింది. రాజ్‌నాథ్‌తో గవర్నర్‌ భేటీలో కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి అలోక్‌ కుమార్‌ కూడా పాల్గొన్నారు. వివిధ అంశాలపై సుమారు గంటకు పైగా చర్చ జరిగింది. అంతకుముందు గవర్నర్‌ నరసింహన్‌ కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి గోయల్‌తో బ’ాటీ అయ్యారు.

వివాదాలను త్వరగా పరిష్కరించండి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్గాల మధ్య నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని గవర్నర్‌కు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సూచించారు. ఇరురాష్గాల మధ్య సహృద్భావ వాతావరణానికి కృషి చేయాలన్నారు.

గవర్నర్‌ నరసింహన్‌ కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ తో జరిపిన భేటీ అనంతరం మాట్లాడుతూ అయితే ఇది రొటీన్‌ విూటింగ్‌ అని, ప్రత్యేకత ఏవిూ లేదని ఈ సందర్బంగా నరసింహన్‌ అన్నారు.ఫోన్‌ టాపింగ్‌, ఒటుకు నోటు కేసు, సెక్షన్‌ ఎనిమిదికి సంబందించిన వివాదం, పదో షెడ్యూల్‌ కు చెందిన సంస్థలపై రెండు రాష్ట్రాల తగవు పడుతున్న తీరు మొదలైనవాటిపై ¬ం మంత్రి రాజ్‌ నాద్‌ సింగ్‌ గవర్నర్‌ తో చర్చించవచ్చని భావించారు.