ఇలాంటివి మామూలే

– ఎస్‌పీజీ భద్రత తొలగింపుపై ప్రియాంక గాంధీ

దిల్లీ,నవంబర్‌ 22(జనంసాక్షి): సోనియా గాంధీ కుటుంబానికి ప్రత్యేక భద్రత గ్రూపు (ఎస్‌పీజీ) సెక్యురిటీని ఉపసంహరించడంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఇలాంటివి రాజకీయాల్లో భాగమని వ్యాఖ్యానించారు . ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయని అన్నారు . గురువారం ప్రియాంక దిల్లీలో విలేకరులతో చూట్లాడారు .ఇందిరా గాంధీ,రాజీవ్‌ గాంధీ మరణం తర్వాతి నుంచి వీరి కుటుంబానికి ఉన్న ముప్పు దృష్ట్యా ఎస్‌ పీజీ | రక్షణ కల్పించిన సంగతి తెలిసిందే . సోనియా సహా, రాహుల్‌, ప్రియాంకకు ఎస్‌ పీజీ భద్రతను కల్పించారు . కొద్ది రోజుల క్రితం ప్రముఖుల భద్రతపై సవిూక్షలో భాగంగా కేంద్ర ¬ంశాఖ వారికి ఎస్పీజీని రద్దు చేసి, జడ్‌-ప్లస్‌ కేటగిరీ సెక్యురిటీని కేటాయించింది. దీనిపై కాంగ్రెస్‌ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే.

ఎస్పీజీ చట్టానికి సవరణ.. త్వరలో బిల్లు

మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులకు కల్పించే ఎస్పీజీ భద్రతకు సంబంధించిన చట్టాన్ని సవరించనున్నారు. దీనికి సంబంధించిన సవరణ బిల్లును వచ్చేవారం లోకసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ దిగువ సభలో ప్రకటించారు .. సోనియా,రాహుల్‌, ప్రియాంక గాంధీకి దాదాపు మూడు దశాబ్దాలుగా కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను ఇటీవల తొలగించిన నేపథ్యంలో ఈ సవరణ బిల్లును తీసుకొస్తుండడం గమనార్హం. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది.ప్రత్యేక భద్రత దళ రక్షణ (సవరణ) బిల్లు ప్రకారం.. ప్రధానిగా వైదొలిగిన ఏడాది పాటు మాత్రమే ఆయన కుటుంబానికి ఎస్పీజీ రక్షణ ఇవ్వనున్నారు . పొంచి ఉన్న ముప్పు స్థాయిని బట్టి మరో ఏడాది భద్రతను కొనసాగిస్తారు. తాజా బిల్లు ప్రకారం మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులెవరికీ ఈ భద్రత ఇకపై ఉండబోదు. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరికే ఎస్పీజీ భద్రత కొనసాగుతోంది .