ఇల్లందులో పురాతన భవనం కూల్చివేత -ఉద్రిక్తత
ఖమ్మం: జిల్లాలోని ఇల్లందు చేపల మార్కెట్లోని పురాతనభవనం కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. భవనంలో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు భవనం కూల్చివేతను అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా కూల్చివేత మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా కొందరు వ్యాపారులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారిని పోలీసులు అడ్డుకున్నారు