ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటాం: నాగేశ్వరరావు
ఖమ్మం: ఇందిబాట పేరుతో ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆయన పర్యటనను ఆడ్డుకుంటామని తెదేపా నేత తుమ్మల నాగేశ్వరావు హెచ్చరించారు. ఖమ్మంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాల మంజూరు విషయంలో కాంగ్రెస్ పాలకుల వ్యవహారశైలిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేతకానిదద్దమ్మ ప్రభుత్వం ఉందని విమర్శించారు.ఖమ్మం నియోజకవర్గంలో 2007లో పేదలకు పట్టాలు ఇచ్చి నేటి వరకూ వారికి స్థలాలు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సమస్యల పరిష్కారం కోసం లాఠీఛార్జి, కాల్పులు జరిగినా వెనక్కితగ్గేదిలేదని స్పష్టం చేశారు.