ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం

15zn343jఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పునర్ నిర్వహించడంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 2016 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం పట్టుదలతో ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లుకు ఆమోదముద్ర వేయించుకోవాలని కేంద్రం భావించినప్పటికీ.. లలిత్ గేట్, వ్యాపం స్కాంలపై ప్రతిపక్షాల ఆందోళనలతో సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో విపక్షాల మద్దతు కూడగట్టి సెషన్ ను పునర్ నిర్వహించేందుకు వీలుగా.. పార్లమెంట్ ను ప్రొరోగ్ చేయకుండా నిరవధిక వాయిదా వేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ మినహా పలు పార్టీలు జీఎస్టీ బిల్లుకు సానుకూలత వ్యక్తం చేయడంతో.. మాన్ సూన్ సెషన్ పునర్ నిర్వహణకు కేంద్రం సిద్ధమైంది.