ఇసుక అక్రమ రవాణాపై ఎన్జీటీ ఆగ్రహం..

3ఢిల్లీ : వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. జేసీబీ, క్రేన్లతో ఇసుక తవ్వకాలు ఎలా జరుపుతారని ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలను ట్రిబ్యునల్‌ ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులు లేని తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించింది. పిటిషన్‌పై స్పందించని మహారాష్ట్ర ప్రభుత్వంపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర రెసిడెన్స్‌ కమిషనర్‌కు అరెస్ట్‌కు గ్రీన్‌ట్రిబ్యునల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది.