ఇసుక మాఫియా మాయాజాలం

డ్యాం తలుపులు ఓపెన

– రేయింబగుళ్లు ఇసుక తరలింపు
– కలెక్టర్కు ఫిర్యాదు

డోర్నకల్ ప్రతినిధి డిసెంబర్ 12 (జనం సాక్షి):
ఆకేరు వాగు గుండా యదేచ్చగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ, నెల్లికుదురు మండలం మొదనతూర్తి గ్రామాల రైతులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంకకు కలిసి ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేశారు.
అధికార పార్టీ ఒక లీడర్ అండదండలతో ఇసుక మాఫియా గత కొన్ని సంవత్సరాలుగా ఆయకట్ట గేటును పలుమార్లు ధ్వంసం చేస్తూ నీటిని వృధా చేస్తున్నారు.ఇసుక అక్రమ రవాణా దారులు నీటిని బయటికి వదిలి ఇసుక తేలగానే ఇసుకను తరలిస్తున్నారని తద్వారా ఆకట్టు పరిసర ప్రాంతాలలో పంటలను సాగు చేస్తున్న రైతులు నీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇదే విషయమై రైతులు పోలీస్, ఇరిగేషన్ ,రెవెన్యూ అధికారులకు, ఫిర్యాదు చేసినప్పటికీ ఈ తంతు మాత్రం ఆగడం లేదు. దీంతో ఇసుక అక్రమ రవాణా దారులకు పరోక్షంగా సహకరించినట్టుగా అవుతుంది. దీంతో ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.

రైతుల పంట పొలాలకు నీర అందించి వారి సమగ్ర అభివృద్ధికి పాటు పడాల్సిన అధికారులు రైతుల ఫిర్యాదులపై నిమ్మకు నిరతనట్లుగా వ్యవహరిస్తున్నారు దుండగుల చేతుల్లో ధ్వంసమైన గేటు సరిగా లేకపోవడంతో నీరు వృధాగా పోతుంది. దీంతో ఖరీఫ్ సీజన్ కు వరి నారుమడులు సిద్ధం చేసే రైతులు, పొలం సాగుకు నీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులు గ్రామ పాలకులు ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకున్న పాపాన పోలేదు.
ఈ ఆయాకట్టు డ్యాం 1964 వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించారు ఈ డ్యాం కుడి ఎడమ కాలువ ద్వారా నర్సింహులపేట నెల్లికుదురు మండలాల గ్రామాలు కొమ్ములవంచ, జయపురం, రామన్నగూడెం,ముంగిమడుగు, మొదనతూర్తి, మునగలవీడు గ్రామాలకు వెయ్యిల ఎకరాల పంట పొలాలకు నీరందిస్తుంది

ప్రభుత్వం రైతుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ ప్రతిష్టాత్మకంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుండగా క్షేత్రస్థాయి అధికారులు రైతుల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు.
దీంతో పలుమార్లు ఫిర్యాదు చేసిన రైతులు అధికారుల నిర్లక్ష్యంపై విసిగిపోయి గ్రామ సర్పంచ్ దాస రోజు వెంకటేశ్వర్లు రైతుల సహకారంతో సుమారు 50 వేల రూపాయలను వెచ్చించి ఆయకట్ట గేటుకు మరమ్మతులు చేపట్టారు.