ఇస్రోకు విదేశీ శాటిలైట్‌ ఆర్డర్లు

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడి
న్యూఢల్లీి,డిసెంబర్‌17(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాలుగు దేశాలతో ఆరు ఒప్పందా లను కుదుర్చుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 2021 నుంచి 2023 మధ్య కాలంలో విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించనున్నది. రాజ్యసభలో మంత్రి దీనిపై లిఖిత సమాధానం ఇచ్చారు. విదేశీ ఉపగ్రహాలను నింగికి పంపడం వల్ల సుమారు 132 మిలియన్ల యూరోలు ఆర్జించవచ్చు అన్నారు. ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) .. అంతరిక్ష శాఖ అనుబంధంతో.. విదేశీ శాటిలైట్లను ప్రయోగిస్తోంది. పీఎస్‌ఎల్వీ రాకెట్ల ద్వారా ఆ ప్రయోగాలు సాగుతున్నట్లు మంత్రి సింగ్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఇస్రో 124 స్వదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వాటిల్లో 12 విద్యార్థులు రూపొందించిన శాటిలైట్లు ఉన్నాయి.