ఇస్రో కౌంట్‌డౌన్ స్వరం మూగబోయింది
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) వరుస అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్-3 (Chandrayaan 3) ప్రయోగంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ తర్వాత సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-L1 (Aditya L-1)ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓ విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. ఇస్రోలో విధులు నిర్వహిస్తున్ను ఓ ప్రముఖ శాస్త్రవేత్త (Isro Scientist) తాజాగా మరణించారు.
ఇస్రో చేపట్టే ప్రయోగాలు ఎంత ముఖ్యమో.. ప్రయోగానికి ముందు చేపట్టే కౌంట్‌డౌన్ (countdown) ప్రక్రియకు అంత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే, ఆ సమయంలో గంభీరమైన స్వరం వినిపించే ఓ ఉద్యోగిని తాజాగా మృతి చెందారు. ఇస్రోలో కౌంట్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న వలర్మతి (50) (Valarmathi) గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చంద్రయాన్-3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె చివరి సారిగా చంద్రయాన్-3కి తన స్వరం వినిపించారు.