ఇస్రో చైర్మన్గా సోమనాథ్
` నియమించిన కేంద్రం
న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి): ఇండియన్ స్పేస్ Ê రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి చీఫ్గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్ను కేంద్రం నియమించింది. విక్రంసారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సోమనాథ్ జీఎస్ఎల్వీ ఎంకే`III లాంచర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. కొల్లాంలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా వ్యవహరిస్తున్న కె శివన్ పదవీ కాలం పూర్తయిన తర్వాత ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష సంస్థల్లో ఒకటైన ఇస్రోకి సోమనాథ్ అధిపతిగా వ్యవహరించనున్నారు.