ఇస్రో వెబ్‌సైట్ హ్యాక్
హైదరాబాద్ 2 జూలై (జనంసాక్షి)
కమర్షియల్ గా నిలదొక్కుకుంటున్న ఇస్రోను దెబ్బతీసేందుకు కుట్రలు మొదలయ్యాయి. రెం డు రోజుల క్రితమే కమర్షియల్ గా గ్రాండ్ సక్సె స్ అయిన ఇస్రోను మానసికంగా, వాణిజ్యప రంగా దెబ్బతీసేందుకు యాంత్రిక్స్ వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు. దీన్ని ఇస్రో కూడా అధికారి కంగా ప్రకటించింది. యాంత్రిక్స్ ¬ం పేజ్‌లో ప్రాబ్లమ్ ఉందని, దాన్ని సరిచేసేందుకు ప్రయ త్నిస్తున్నామని ప్రకటించింది.ఈ నెల 10న బ్రిట న్ కు చెందిన ఐదు కమర్షియల్ శాటిలైట్లను ఇ స్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. దాం తో యాంత్రిక్స్ కు 180 కోట్ల ఆదాయం వచ్చిం ది. అది ఓర్చుకోలేని చైనాకు చెందిన హ్యాకర్లు ఇ స్రో కమర్షియల్ వెబ్ సైట్‌ను టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. అయితే ఈ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురవ్వడం పట్ల ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పని లేదని, సైబర్ వార్ లో భాగంగా ఇలాంటి పనులు జరుగుతూనే ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఈ విషయంలో ఇస్రో మరింత అప్ర మత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఆసియాలో ప్రధా నంగా భారత్, చైనాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకూ చైనా అధిగమించని ఫీట్ ను ఇ స్రో సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడంతో హ్యాకిం గ్ ద్వారా చైనా తమ దుర్బుద్దిని బయటపెట్టినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే యాంత్రిక్స్ కు చెందిన అధికారులు మాత్రం హ్యాక్ చేసిందెవరనేది అధికారికంగా ప్రకటించలేదు. అయితే కేవలం ¬ం పేజీ మాత్రమే హ్యాకింగ్ కు గురైందని, మిగిలిన పేజీలు సక్రమంగానే పని చేస్తున్నట్లు ప్రకటించారు.