ఇస్రో సహకారంతో పిడుగుల గుట్టు

నెల్లూరు,మే20(జ‌నంసాక్షి): అత్యాధునిక వాతావరణ సాంకేతిక పరిజ్ఞానంతో  పిడుగుపాటును ముందే తెలుసుకుంటున్నారు. ఇదంతా ఇస్రో సహకరాంతో చేశారు. దీనిని మరింతగా అభివృద్దిపరచి ముందుకు పోతే విపత్తులనుకూడా పసిగట్టవచ్చని భావిస్తున్నారు. పిడుగు పాటు వల్ల కలిగే మరణాలని ఆపడం కోసం ఏపీ ప్రభుత్వం ఇస్రోతో ఒప్పందం చేసుకుంది. అలాగే అమెరికాకు చెందిన ఎర్త్‌ నెట్‌ వర్క్‌ తో కూడ ఒప్పందం కుదుర్చుకుంది. పిడుగులను ముందే పసిగట్టే టెక్నాలజీని అందిపుచ్చుకుని రాష్ట్రంలో 15 చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎక్కడైతే పిడుగు పడే అవకాశం ఉందో అక్కడి దగ్గర్లోని సెల్‌ టవర్ల ద్వారా మొబైళ్లకు మేసేజ్‌ లు వెళతాయి. మొదటిసారి ఆ టెక్నాలజీని పయోగించుకున్నారు. పిడుగులు పడతాయని పలు గ్రామాల్లో దండోరా వేయించి… ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్తపడ్డారు. దండోరా సమయంలో  గ్రామస్థులంతా తలుపులు వేసుకుని ఇళ్లల్లోనే ఉండడంతో భారీ ప్రాణనష్టం తప్పుతోంది. సరిగ్గా పిడుగులు పడడానికి అరగంట ముందు ఏపీ అధికారులు గ్రామాల్లో దండోరా వేయించడంతో పాటూ, ఫోన్లకు వాయిస్‌ మెసేజ్‌లు పెడుతున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని, ఎవరూ ఇళ్లల్లోంచి బయటికి రావద్దని ఆయాగ్రామాల్లో దండోరా వేయించారు. దీంతో గ్రామస్థులంతా ఇళ్లల్లోనే ఉంటున్నారు.