ఈక్వెడార్‌లో పెనువిపత్తు

C

– భారీ భూకంపం

– 233 మంది మృతి

– కుప్పకూలిన భవంతులు

– కొనసాగుతున్న సహాయక చర్యలు

క్వీటో,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):ఈక్వెడార్‌ రాజధాని క్వీటోను భారీ భూకంపం కుదిపేసింది. భూకంప ధాటికి మృతిచెందిన వారి సంఖ్య 233 కి పెరిగినట్టు ఆ దేశ ఉపాధ్యక్షుడు జార్జ్‌ గ్లాస్‌ వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7గంటలకు భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (యు.ఎస్‌.జి.ఎస్‌) అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఈక్విడార్‌ రాజధాని క్విటోకు 160 కిలోవిూటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు జార్జ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజధాని క్వీటోలో భూప్రకంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడి ప్రాంతీయ తీరప్రాంతాల్లో సునావిూ హెచ్చరికలను జారీ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, స్థానిక కాలమానం ప్రకారం శనివారం 11.58 గంటల ప్రాంతంలో భూకంప కేంద్రానికి 300 కిలోవిూటర్ల దూరంలో బలమైన భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు పసిఫిక్‌ సునావిూ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు అమెరికా జీయోలాజికల్‌ సర్వే వెల్లడించింది.  క్వీటోకు పశ్చిమ-వాయువ్యంగా 173 కిలోవిూటర్ల దూరంలో, మరో చోట ఆగ్నేయ దిశగా మూస్నేకు 28 కిలోవిూటర్ల దూరంలో భూప్రకపంనలు చోటుచేసుకున్నాయి. 11 నిమిషాల కాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు కుదిపేసినట్టు యూస్‌జీయస్‌ వెల్లడించింది. తొలుత భూకంప తీవ్రత 4.8 గానూ, రెండో భూకంప తీవ్రత 7.8 గా నమోదైనట్టు తెలిపింది.భారీ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వీటితోపాటు శిథిలాకింద పలువురు కూరుకుపోయారు. వీరిని వెలికి తీసేందుకు 10,000 మంది సహాయకులు, 3500 మంది పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

భారీగా ఆస్తినష్టం

భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌, రవాణా, సమాచార వ్యవస్థలకు అంతరాయమేర్పడింది. భూకంపం కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, రహదారులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈక్విడార్‌లోని ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు జార్జ్‌ పేర్కొన్నారు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.భారీ భూకంపం ధాటికి ఈక్విడార్‌ అతలాకుతలమైంది. దాదాపు 40 సెకన్ల పాటు తీవ్రమైన భూ ప్రకంపనలు రావడంతో ఇళ్లు, వాణిజ్యసముదాయాలు కుప్పకూలాయి. ప్రాణ భయంతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు. వేలాది వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో గుయాక్విల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, మంతా ఎయిర్‌పోర్టును మూసివేశారు. మొబైల్‌ ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈక్విడార్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ అనేక మంది శిధిలాల కింద చిక్కుకుపోయారని భావిస్తున్నారు. టొకాయ్‌ విశ్వవిద్యాలయంలోని వసతి గృహం కూడా ధ్వంసమైంది. ఇందులో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ప్రకంపనల తాకిడికి భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, రోడ్లు, రైల్వే లైన్లు మట్టి దిబ్బల కింద కూరుకుపోయాయి. అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. 11 నిమిషాల కాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు కుదిపేసినట్టు యూస్‌జీయస్‌ వెల్లడించింది. తొలుత భూకంప తీవ్రత 4.8 గానూ, రెండో భూకంప తీవ్రత 7.8 గా నమోదైనట్టు తెలిపింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండటంతో మరణించిన వారి సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, జపాన్‌లో రెండు రోజుల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు అక్కడ తీవ్ర నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే.