ఈజిప్టు పరిణామాలపై ఇందోళన వ్యక్తం చేసిన ఒబామా

వాషింగ్టన్‌,(జనంసాక్షి): ఈజిప్టులో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలన్న ఆకాంక్షాను వెలిబుచ్చారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన ప్రభుత్వానికి అధికారం అప్పగించాలని ఈజిప్టు సైన్యానికి విజ్ఞప్తి చేశారు. వీలయినంత త్వరగా పారదర్శకంగా ఈ ప్రక్రియ పూర్తి చేయలని కోరారు.
ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్‌ ముర్సీని పదవి నుంచి తప్పించడమే కాకుండా, దేశంలో రాజ్యాంగాన్ని సస్పెండ్‌ చేస్తూ సైన్యం తీసుకున్న నిర్ణయం ఆందోళన కలిగిస్తుందని బరాక్‌ ఒబామా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని ఈజిప్టు సైన్యాన్ని కోరారని ఆయన తెలిపారు. ముర్సీ, ఆయన మద్దతుదారులను నిరంకుశంగా అరెస్టు చేయడం తగదని సూచించారు.