ఈజిప్టు ప్రధానిగా షరీఫ్ ఇస్మాయిల్ ప్రమాణం
హైదరాబాద్, సెప్టెంబర్19(జనంసాక్షి): ఈజిప్టు దేశ ప్రధాన మంత్రిగా షరీఫ్ ఇస్మాయిల్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అవినీతి కుంభకోణాల ఆరోపణలతో అంతకుముందు ప్రధానిగా ఉన్న ఇబ్రహీం మెహల్బ్ నేతృత్వంలోని మంత్రివర్గం వారం రోజుల కిందట రాజీనామా చేసింది. ఆ మంత్రివర్గంలోని వ్యవసాయ శాఖ మంత్రి షలాహ్ హెలాల్ అవినీతి కుంభకోణంలో అరెస్టు కావడంతో ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫత్తాహ్ ప్రధాని ఇబ్రహీం మెహల్బ్ రాజీనామాను ఆమోదించారు. దీంతో చమురు శాఖ మాజీ మంత్రి అయిన షరీఫ్ ఇస్మాయిల్ ఈ రోజు ప్రధాని బాధ్యతలు స్వీకరించారు.