ఈటెల త్వరగా కోలుకోవాలి
– సీఎం కేసీఆర్ పరామర్శ
– ఆసుపత్రి నుంచి మంత్రి డిశ్చార్జ్
హైదరాబాద్, జూన్15(జనంసాక్షి):
ప్రమాదంలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈటల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతున్న మంత్రి ఈటల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..ఆయనకు రెండు రోజులు విశ్రాంతి అవసరమని ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయన దాదాపు 15 నిముషాలు అక్కడ గడిపారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను సోమవారం మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈటెల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కాగా తెలంగాణ ఆర్థికశాఖమంత్రి ఈటెల రాజేందర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
7.బాబు..! ఆ గొంతు నీదా ? కాదా ?