ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతి
రాజన్న సిరిసిల్ల: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతిచెందిన విషాద సంఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది. కొనరావుపేట మండలం పిల్లమక్త గ్రామానికి చెందిన మణి (13), రాజు (14), సంజీవ్ (16) అనే ముగ్గురు విద్యార్ధులు శుక్రవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లారు. అయితే… అక్కడ నీటిలో మునిగిపోవడంతో మృతిచెందారు. కాగా… ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్ధులు మృతిచెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్ధుల మృతదేహాలపై పడి వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.