ఈనెల 16 నుండి జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు
మిర్యాలగూడ. జనం సాక్షి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఇటివలే జరిగిన సమావేశంలో “సెప్టెంబర్- 17”వ తేదిని తెలంగాణ జాతీయ సమైక్యతా దినం గా ప్రకటించారు. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మూడ్రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలు ప్రారంభం కానున్న నేపద్యంలో ఈరోజు స్థానిక షాబు నగర్ లోగల ఎ ఆర్ సీ గార్డెన్స్ నందు జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి మంత్రి కెసిఆర్ గారు ఈనెల (16,17,18 తేదిల్లో) మూడ్రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గం లో ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని వాటికీ తగు ఏర్పాట్లు చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీసీఎంస్.వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి, ధీరావత్ నందిని-రవితేజ, ధనవాత్ బాలాజీ నాయక్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, ఆర్డిఓ, రోహిత్ సింగ్, డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, జడ్పీటీసీ అంగోతు లలిత-హతిరం,ఎం ఆర్ ఓ అనిల్, వైస్ ఎంపీపీ కటికం సైదులు రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, స్థానిక కౌన్సిలర్లు, పోలీస్ అధికారులు, ఎంపీడీఓ లు, సర్పంచ్లు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.