ఈనెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

pదిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు పార్లమెంటు హాల్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బడ్జెట్‌ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకున్నారు.

తొలి విడత ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు, ఏప్రిల్‌ 25 నుంచి మే 13 వరకు రెండో దఫా సమావేశాలు నిర్వహించాలని అఖిలపక్షంలో నిర్ణయించారు. ఫిబ్రవరి 25న రైల్వే బడ్జెట్‌, 26న ఆర్థిక సర్వే, 29న సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెడతారు.