ఈనెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు విడుదల
తిరుమల : ఈ రోజు నుంచి ప్రారంభించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎంతో ఆశతో బుకింగ్ కోసం క్యూలో గంటల తరబడి నిలబడ్డ భక్తులు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య పరిష్కారానికి టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు విడుదల చేసిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈసారి శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ పెంచింది. ఈ నెల 24 నుంచి అదనపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25 వేలకు పెంచింది. దీంతో మార్చి నెల సర్వదర్శన టికెట్లను రోజుకు 20 వేలకు పెంచిన టీటీడీ, నిత్యం 5 వేల చొప్పున అదనపు కోటా కింద జారీ చేయనున్నది. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లను జారీచేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.