ఈనెల 27న భద్రాద్రి రాముని డోలోత్సవం
భద్రాచలం: భద్రాచలం శ్రీరాముని ఆలయంలో ఈనెల 27వ తేదీన డోలోత్సవం నిర్వహించానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు స్వామి వారికి డోలోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనిలో
భాగంగా 26వ తేది సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ ఉంటుంది. వచ్చే నెల 19న జరిగే శ్రీరాముని కల్యాణంలో భాగంగా ఈనెల 27న స్వామివారిని పెళ్లికొడుకుగా ముస్తాబు చేయడం, కల్యాణ తలంబ్రాలు కలిపే వేడుకను నిర్వహిస్తున్నారు. అందువల్ల 27న నిత్య కల్యాణం ఉండదని ఆలయ వర్గాలు పేర్నొన్నాయి.