ఈనెల11నుంచి 13వరకు మంచినీరు బంద్
భద్రచలం: పట్టణంలో ఈ నెల 11నుంచి 13వరకు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రజారోగ్యశాఖ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. మంచినీటి పైపుల రిపేరుకారణంగా సరఫరా చేయలేకపోతున్నామన్నారు.ప్రధానంగా డాక్టర్ చంద్రప్రసాద్ వీధి డాక్టర్ మోహన్‌రావు కాలనీ, చర్లరోడ్డు రాజరాజేశ్వరి గుడి వీధి నెహ్రూ మార్కెట్‌రోడు, బ్యాంక్ వీధుల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.