ఈమెయిల్ సృష్టికర్త కన్నుమూత

1ఎలక్ర్టానిక్‌ మెయిల్ తో సమాచార రంగంలో విప్లవం సృష్టించిన రాయ్‌ టామ్లిసన్‌ మృతి చెందారు. 74 ఏళ్ల వయసున్న ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కంప్యూటర్‌ ప్రొగ్రామర్‌ కెరీర్ ప్రారంభించిన టామ్లిసన్‌ అంచెలంచెలుగా ఎదిగారు. సమాచార రంగంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఈ మెయిల్‌ ను కనుగొన్నారు.ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు సందేశాలను పంపించే విషయంలో రాయ్‌ అనేక ప్రయోగాలు చేశారు. 1971లో బోస్టన్ లో తాను పని చేస్తున్న సంస్థలోని సహోద్యోగికి మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ మెయిల్ ను విజయవంతంగా పంపించగలిగారు. మెయిల్ ఐడీలో కీలక సింబల్‌ అయిన ఎట్‌ ది రేట్‌ ను మొదటిసారి వినియోగించింది కూడా రాయే కావటం విశేషం.మొదట బోల్ట్, బెరానెక్ అండ్ న్యూమన్ సంస్థల్లో రాయ్‌ పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఆర్పానెట్ సంస్థలో చేరి… ఈ మెయిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఈ మెయిల్‌ ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు రాయ్‌ ఎంతోగానో కృషి చేశారు. ఈ మెయిల్‌ లో విస్తృతంగా వ్యాపి చెందిన తర్వాతే ఇంటర్‌ నెట్ లో వాడకం ఎక్కువైంది. ఇంటర్నెట్ వ్యాప్తికి విశేష కృషి చేసినందుకు రాయ్ టామ్లిసన్ 2012లో ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్ గా గుర్తింపు