ఈసీ నోటీసులకు సీఎం కేసీఆర్ వివరణ
ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కరీంనగర్ ఎన్నికల బహిరంగసభలో వ్యాఖ్యలపై ఈసీ ఇచ్చిన నోటీసులకు వివరణ అందజేశారు. రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధప్రకాశ్‌కు వివరణ ప్రతిని టీఆర్‌ఎస్ నాయకులు అందజేశారు. ఈసీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఉన్నారు.