ఈసీ వైఖరి సరికాదు

– ఎన్నికల ఫలితాలకు చాలా సమయముంది
– ఈలోగో ప్రభుత్వం చేతులు ముడుచుకుకూర్చోవాలా?
– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి
అమరావతి, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందంటూ ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తున్న ఎన్నికల సంఘం అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇవ్వక పోవడం సరికాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. కోడ్‌పై హడావుడి చేసే ఎన్నికల సంఘం వీవీ ప్యాట్లు లెక్కించమంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఎంతో సమయం ఉందని, ఈలోగా ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవాలా  అని ప్రశ్నించారు. తాగునీటి సమస్యతోపాటు రైతుల్ని ఆదుకునేందుకు ఈసీ చొరవ చూపాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే క్రమంలో పాలకుల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలే తప్ప, ఎన్నికల కోడ్‌ పేరుతో తప్పించుకోవాలనుకోవడం సరికాదని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పక్కనబెడితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే కోడ్‌ పేరుతో పట్టించుకోకుండా ఉంటారా అంటూ.. మరి ఎవరు శాంతిభద్రతలు పర్యవేక్షిస్తారని అన్నారు. దేశంలో మోదీ హవా తగ్గిందని, ఐదేళ్ల మోదీ పాలనతో దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలు విసిగిపోయారని అన్నారు. మోదీ మళ్లీ వస్తే పేద, మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడతామని తెలుసుకున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌కే అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తలసిరెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ను
గెలిపించకొని రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసుకోవాలని చూస్తున్నారని, దీని వల్ల దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి ఆసధ్యమవుతుందని భావిస్తున్నారని తెలిపారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే శక్తి ఒక్క రాహుల్‌కే ఉందని పేర్కొంటున్నారని, రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తొలి సంతకం ఏపీ ప్రత్యేక ¬దాకే నని రాహుల్‌ ఇప్పటికే ప్రకటించారని తులసిరెడ్డి గుర్తు చేశారు.