ఈ నెల 24 నుంచి 26వరకు భీమన్నదేవ జాతర ఉత్సవాలు
కాగజ్‌నగర్, జనంసాక్షి: కాగజ్‌నగర్ మండలంలోని జగన్నాథపూర్ భీమన్నదేవర ఆలయంలో ఈ నెల 24నుంచి 26 వరకూ నిర్వహించతల పెట్టిన జాతర ఉత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. గురువారం రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.