ఈ నెల 26 నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): స్థానిక సంతోషిమాత దేవాలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు పది రోజుల పాటు దేవి శరన్నవరాత్రులు నిర్వహించేందుకు అన్ని  ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ అధ్యక్ష, కార్యదర్శులు నూక వెంకటేష్ గుప్తా, బ్రహ్మాండ్లపల్లి మురళీధర్ తెలిపారు.శుక్రవారం దేవాలయంలోని ఆధ్యాత్మిక గ్రంథాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ ఈ నవరాత్రులలో ప్రతిరోజు ఉదయం చండీ హోమం , సాయంత్రం రుద్రహోమం, ప్రత్యేక కుంకుమార్చన లతోపాటు భవానీ దీక్షలు, చిన్నారులకు అక్షరాభ్యాసాలు, సరస్వతి పూజలు , అన్నదానంతో పాటు  పసుపుకొమ్ముల పూజ, గాజుల పూజ, పుష్పార్చన, బిల్వార్చన, సుగంధద్రవ్యాలతో పాటు అమ్మవారికి తెనాలి వారిచే వివిధ అలంకరణలు చేయనున్నట్లు తెలిపారు.మొదటిరోజు మంగళ గౌరీ దేవి, రెండోరోజు బాలా త్రిపుర సుందరి దేవి, మూడవ రోజు గాయత్రీదేవి , నాలుగో రోజు అన్నపూర్ణాదేవి, ఐదొవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, ఆరవ రోజు మహాలక్ష్మి దేవి, ఏడవ రోజు సరస్వతి దేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదవ రోజు  మహిషాసుర మర్దిని దేవి, పదవ రోజు విజయదశమి రోజున రాజరాజేశ్వరి దేవి అలంకరణలు చేయనున్నట్లు తెలిపారు.అదే రోజు సాయంత్రం జమ్మిగడ్డలోని మండల పరిషత్ కార్యాలయంలో శమి పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉపాధ్యక్షులు నరేంద్రుని విద్యాసాగర్ రావు ,పబ్భా ప్రకాష్ రావు,అన్నదాన నిర్వాహకులు కొత్తా మల్లికార్జున్, బ్రహండ్లపల్లి దేవిదత్తు, కోశాదికారి పాలవరపు రామమూర్తి, నామిరెడ్డి పాపిరెడ్డి మహంకాళి సోమయ్య బజ్జూరి శ్రీనివాస్ మహంకాళి ఉపేందర్, కొల్లూరు రత్నమాల,గాయం శ్రీదేవి, ఓరుగంటి జగదీశ్వరి,దేవాలయ మేనేజర్ బచ్చుపురుషోత్తం  తదితరులు పాల్గొన్నారు.