ఉందిలే మంచి కాలం
– రాబోవు రోజుల్లో భారీ వర్షాలు
– సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,సెప్టెంబర్18(జనంసాక్షి):
గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలతో తెలంగాణ తీవ్ర కరువు నుంచి బయ టపడినట్లేనని సీఎం కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన రబీ సీజన్ కు ధోకా కుండదన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై వ్యవసాయ శాఖ, తాగునీటి శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం రాత్రి సీఎం సవిూక్షా సమావేశం నిర్వహించారు.జులై, ఆగస్టులో వర్షాలు లేకున్నా సెప్టెంబర్ లో కురిసిన వర్షాలు రైతులకు ఉపయోగపడతాయని, మహబూబ్ నగర్ మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురు స్తుండటం శుభసూచికమని సీఎం అన్నారు. ఖరీఫ్ సీజన్ లో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని సర్వే ద్వారా వాస్తవ వివరాలు తెలుసుకొని వెంటనే చర్యలు చేప ట్టాలని అధికారులకు సూచించా రు. ఇదిలా ఉండగా ఈ నెల 22న టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం నిర్వహించనున్నట్లు తెలిసింది. తెలం గాణలో కొనసాగుతున్న
రైతుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ సభలో ప్రకటన చేస్తారని సమాచారం.
జలకళను సంతరించుకుంటున్న ప్రాజెక్టులు
రానున్న 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. విదర్భ కేంద్రంగా కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం… కాస్త బలహీనపడి వాయుగుండంగా మారిందని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్నిచోట్ల వానలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సంచాలకులు నరసింహారావు చెప్పారు. కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షపాతం దాదాపు సాధారణ స్థాయికి వచ్చిందని… తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం విూదుగా అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని… దీని ప్రభావంతో నాలుగు రోజుల తర్వాత కోస్తాంధ్ర, తెలంగాణల్లో వర్షాలు కురుస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రస్తుత నీటిమట్టం 10.55 టీఎంసీలు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 11.9 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 11,465 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 13,965 క్యూసెక్కులుగా ఉంది. జూరాల కుడి, ఎడమ కాలువతో పాటు నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు నీటిని అధికారులు విడుదల చేశారు. రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో తెలుగురాష్టాల్లోన్రి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన కురుస్తున్న వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 11.9 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 10.55 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి ప్రస్తుతం 11465 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లోగా వస్తుండగా..13965 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. దీంతో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా..10వేల క్యూసెక్కులు నీరు శ్రీశైలం వైపు వెళ్తున్నాయి. మరోవైపు సుంకేసుల నుంచి సైతం నిలకడగా నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా, తుంగభద్ర నుంచి సుమారు 40వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం వైపు వెళ్తోంది.