ఉక్రెయిన్‌కు మరోసారి అమెరికా భారీ సాయం

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి ) : రష్యా సైనికతో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు ఇప్పటికే అనేక   రూపాల్లో సాయం అందించిన అమెరికా మరోసారి భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. భద్రతా సాయం కింద ఉక్రెయిన్‌కు 325 మిలియన్‌ డాలర్లు (రూ.2,695 కోట్లు) ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు బైడెన్‌ వెల్లడిరచారు. తాజాగా వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఆయన సమావేశమై రష్యాతోయుద్ధంపై చర్చించుకున్నారు. రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్‌ సార్వబౌమత్వాన్ని కాపాడడమే తమ కర్తవ్యమని బైడెన్‌ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ ప్రజలు అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు సహా ఉక్రెయిన్‌కు రూ.2,695 కోట్ల సాయం అందజేయబోతున్నామని తెలిపారు.