ఉగ్రదాడులను ఖండించిన ప్రధాని, రాష్ట్రపతి

cxoc9o74హైదరాబాద్: పారిస్ ఉగ్రదాడుల ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడి ఘటన తీవ్రంగా మనోవేదన, క్షోభకు గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పేలుళ్ల ఘటనలో తీవ్రంగా గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పారిస్‌లో ఉగ్రవాదుల దాడిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. ఈ కష్ట సమయంలో ప్రాన్స్ ప్రజలకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఉగ్రదాడిని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఖండించారు. పారిస్ ఘటనపై స్పందించడానికి మాటలు రావడంలేదన్నారు. అమాయక ప్రజలను ముష్కరులు పొట్టనపెట్టుకున్న ఘటన కలిచివేసిందని తెలిపారు. పారిస్‌లో భారత రాయబారి కార్యలయం హెల్ప్‌లైన్ నెంబర్ 0033140507070 ప్రకటించారు.