ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

5

– పలు కీలక ఒప్పందాలపై భారత్‌- ఫ్రాన్స్‌ సంతకాలు

న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి):కష్ట సమయాల్లో భారత్‌ చూపిన స్నేహ బంధాన్ని మరిచిపోలేమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ ¬లాండె అన్నారు. రిపబ్లిక్‌ డే వేడుకల్లో అతిథిగా పాల్గొనడానికి వచ్చిన ఆయన ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌ లో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు సంయుక్తంగా విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ¬లాండే మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై పోరాటంలో ఇరు దేశాలు కలిసి కట్టుగా పనిచేస్తాయన్నారు. వాతావరణ మార్పులపై అభివృద్ధి చెందిన దేశాలు నియంత్రణ పాటించాలని మోదీ చేసిన సూచనను ¬లాండె గుర్తు చేశారు. సాంప్రదాయాల నుంచి రక్షణ వ్యవహారాల వరకు ఇరు దేశాల మధ్య ఒకేరకమైన ఆసక్తి ఉందని ¬లాండె అన్నారు. రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై ఒప్పందం కూడా తుది దశలో ఉందన్నారు. సైబర్‌ సెక్యూరిటీ పైన కూడా ఒప్పందం కుదిరిందన్నారు. భారతదేశానికి ఫ్రాన్స్‌ సన్నిహిత మిత్రుడని ప్రధాని మోడీ అన్నారు. భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. రెండు దేశాల సంబంధాలు కాలపరీక్షను ఎదుర్కొని నిలిచాయని కొనియాడారు. రక్షణ రంగంలో 36 రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌ తో ఒప్పందం చేసుకున్నట్టు మోడీ వెల్లడించారు. రైలు ఇంజన్‌ నుంచి ఉపగ్రహాల నిర్మాణం వరకు, సౌర విద్యుత్‌ నుంచి అణు విద్యుత్‌ వరకు ఫ్రాన్స్‌ తో భారత్‌ కలిసి పనిచేస్తుందని ప్రధాని మోడీ ప్రకటించారు. పారిస్‌, పఠాన్‌ కోట్‌ లలో ఉగ్రదాడులను ఖండించారు. మానవత్వంపై నమ్మకం ఉంచిన ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు సహకరించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. ¬లాండే-ఫ్రాన్స్‌ దేశాల మధ్య ఈ సందర్భంగా 13 కీలక ఒప్పందాలు కుదిరాయి.  కష్ట సమయాల్లో భారత్‌ చూపిన స్నేహ బంధాన్ని మరిచిపోలేమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ ¬లాండె తెలిపారు.  సోమవారం ఫ్రాన్స్‌, భారత్‌ మధ్య మొత్తం 13 ఒప్పందాలపై సంతకాలు చేసిన నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా మాట్లాడారు. సంయుక్త ప్రకటన సందర్భంగా మాట్లాడుతూ ఇరు దేశాలు ఉగ్ర పోరులో కలిసి కట్టుగా పనిచేస్తాయన్నారు. వాతావరణ మార్పులపై అభివృద్ధి దేశాలు నియంత్రణ పాటించాలని మోదీ చేసిన సూచనను ¬లాండె గుర్తు చేశారు. సాంప్రదాయాల నుంచి రక్షణ వ్యవహారాల వరకు ఇరు దేశాల మధ్య ఒకేరకమైన ఆసక్తి ఉందని ¬లాండె అన్నారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై ఒప్పందం కూడా తుది దశలో ఉందన్నారు. సైబర్‌ సెక్యూర్టీపైన కూడా ఒప్పందం కుదిరిందన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై భారత్‌తో కలిసి పనిచేస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు అన్నారు. రిపబ్లిక్‌డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటనకు గాను భారత్‌కు వచ్చిన ఆయన సోమవారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీల సమక్షంలో జరిగిన స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన పర్యటన వల్ల ఇరు దేశాల ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని, అందుకు పూర్తి సహకారాన్ని తాము అందిస్తామని ఆయన భరోసా  ఇచ్చారు. ఫ్రాన్స్‌, భారత్‌లకు ఉగ్రవాదం ఎప్పుడూ సమస్యేనని అందుకే ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి తాము భారత్‌కు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అలాగే కాప్‌-21 సదస్సులో దేశాలన్నీ కలిసి తీసుకున్న నిర్ణయాల్ని పాటించేందుకు, వాతావరణంలో వస్తున్న మార్పుల్ని ఎదుర్కొనేందుకు భారత్‌తో కలిసి ప్రయాణిస్తామన్నారు. కాప్‌21 సదస్సు విజయవంతం కావడంలో మోదీ చొరవ ఎంతగానో ఉందని కొనియాడారు.  రాష్ట్రపతి భవన్‌కి వెళ్లక ముందు దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. ‘విూ దేశ రాజ్యాంగం పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ¬లాండ్‌ అన్నారు. భారత రిపబ్లిక్‌ డే దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని చెప్పిన ఆయన ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ పాత్ర ఆహ్వానించదగినదని కొనియాడారు. చాలా కాలంగా ఫ్రాన్స్‌, భారత్ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఇరుదేశాలకు ఇప్పటికే ఒక అవగాహన ఉందని చెప్పారు. భారత్‌ తమకు ఇస్తున్న మద్దతు ఎప్పటికీ మరువలేనిదని చెప్పారు. తమ పిల్లలను పొట్టన పెట్టుకున్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థను అంత తేలికగా విడిచిపెట్టబోమని, ఈ విషయంలో తాము దృఢనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే శక్తులను ఉమ్మడిగా ఎదుర్కొంటామని చెప్పారు. అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ ¬లాండ్‌ భారత్‌ కు మంచి మిత్రుడని అన్నారు. ఫ్రాన్స్‌ తో సంబంధాలను తమ దేశం ఎప్పటికీ గౌరవిస్తుందని చెప్పారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ, ¬లాండ్‌ కలిసి గూర్గావ్‌ కు ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు.