ఉగ్రవాదానికి ఇస్లాం వ్యతిరేకం

4

– ముంబైలో ముస్లింల ప్రచారం

ముంబై,జనవరి2(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. ఇస్లాం రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ ఐఎస్‌ విధ్వంసాలకు పాల్పడుతోంది. సోషల్‌విూడియా, ఇతరత్ర మార్గల ద్వారా యువకులను ఆకర్షించి వారితో మారణ ¬మాలను సృష్టిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థలను వ్యతిరేకిస్తూ ప్రపంచదేశాలు పోరాడుతున్నాయి. ఐసీస్‌ను వ్యతిరేకిస్తూ ముంబైలో కొందరు ముస్లింలు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా ముస్లింలకు ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజున ‘ముస్లిం అగనెస్ట్‌ ఐసీస్‌’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముంబైకి చెందిన సాహస్‌ ఫౌండేషన్‌, థింక్‌ టాంక్‌ ఉర్దూ మర్కాజ్‌ సంస్థలు దీన్ని ప్రారంభించాయి. దీనిలో భాగంగా వాలంటీర్లుగా ఏర్పడిన బృందం ఉగ్రవాదానికి ఆకర్షితులు కాకుండా యువతకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో అనూహ్యంగా ఏదైనా మార్పులు గమనిస్తే… తమకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి ఆకర్షితులైన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.