ఉగ్రవాదానికి పాక్ మద్ధతు
ఇస్లామాబాద్,ఆగస్టు 4(జనంసాక్షి): పాకిస్థాన్‌లో జరుగుతున్న సార్క్ సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ అభిప్రాయాన్ని విస్పష్టంగా విన్పించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థల పట్ల ఆయన పదునైన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థలపైనే కాకుండా వాటికి మద్దతిస్తున్న సంస్థలు, దేశాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ నుంచి భారత్‌లో దాడులకు పాల్పడుతున్నాయన్న విషయాన్ని పరోక్షంగా గట్టిగా వినిపించారు. అలాగే ఉగ్రవాదులను అమరవీరులుగా పేర్కొనడంపైనా రాజ్‌నాథ్ మండిపడ్డారు. ఉగ్రవాదులను అలా పొగడడం తగదన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో భద్రతాసిబ్బంది హతమార్చిన హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వానిని పాకిస్థాన్ యోధుడిగా పేర్కొనడాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరు.. ఉగ్రవాదం అంటే ఉగ్రవాదమే అని రాజ్‌నాథ్ ఇస్లామాబాద్‌లో సార్క్ దేశాల ¬ం మంత్రుల సమావేశంలో అన్నారు.
బుర్హాన్ వానిని మట్టుపెట్టిన అనంతరం కశ్మీర్‌లో కల్లోల పరిస్థితులు, భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజ్‌నాథ్ ప్రసంగాన్ని పాకిస్థాన్ అధికార పీటీవీలో ప్రసారం చెయ్యలేదు. అలాగే భారత విూడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. హిజ్బుల్, లష్కరే ఉగ్రవాద సంస్థలు పాక్‌లో రాజ్‌నాథ్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలో సార్క్ సమావేశంలో ఉగ్రవాదంపై విరుచుకుపడుతూ కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రసంగాన్ని పాక్ అడ్డుకుంది. పాకిస్థాన్ టీవీని మాత్రమే అనుమతించిన పాక్ అధికారులు కేవలం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ ¬ం మంత్రి సందేశాలను మాత్రమే ప్రసారం అయ్యేలా చేశారు. రాజ్‌నాథ్ ప్రసంగం కవర్ కాకుండా ఇండియన్ విూడియాను, అంతర్జాతీయ విూడియానూ పాక్ అడ్డుకుంది. దీనిపై ఇండియన్ విూడియా, ఇంటర్నేషనల్ విూడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేసినా నవాజ్ సర్కారు లెక్కచేయలేదు. రాజ్‌నాథ్ ప్రసంగం పాకిస్థాన్ ప్రజలకు తెలిస్తే తన సర్కారుకు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రసారం కాకుండా ఆంక్షలు విధించారు. సార్క్ సమావేశానికి వచ్చిన మంత్రులను సమావేశం జరగనున్న సెరెనా ¬టల్ వద్ద పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి నిసార్ అలీ ఖాన్ స్వాగతం పలికారు. ఆ సమయంలో రాజ్‌నాథ్ నిసార్‌తో కరచాలనం చేశారు. సార్క్ సమావేశానికి ముందు వీరిద్దరూ తొలిసారి అప్పుడే కలుసుకున్నారు. కేవలం మర్యాదపూర్వకంగా షేక్‌హ్యాండ్ ఇచ్చి రాజ్‌నాథ్ ముందుకు వెళ్లిపోయారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశాలు ఉండబోవని భారత్ వెల్లడించిన సంగతి తెలిసిందే
నవాజ్‌తో రాజ్‌నాథ్ భేటీ
పాక్ పర్యటనలో ఉన్న కేంద్ర¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం ఆ దేశ ప్రధాని నవాజ్‌షరీఫ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షరీఫ్ జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిణామాలపై రాజ్‌నాథ్‌తో చర్చించారు. ఇస్లామాబాద్‌లో సార్క్ దేశాల ¬ంమంత్రుల సదస్సును ప్రారంభించిన సందర్భంగా నవాజ్‌షరీఫ్ మాట్లాడుతూ.. కశ్మీర్ సమస్య కేవలం భారత్‌కు సంబంధించిన అంశం కాదని అన్నారు. కశ్మీర్‌లో ఇటీవల నెలకొన్న అల్లర్లతో ఇస్లామాబాద్‌లోని సెరెనా హాటల్ పరిసరప్రాంతాల్లో పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరింపజేశామని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే కాశ్మీర్ విషయంలో పాక్ తలదూర్చరాదని భారత్ హెచ్చరిస్తోంది.
ఆ విందులో పాల్గొనకుండానే భారత్‌కు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ¬ంమంత్రి చౌదరి నిస్సార్ ఆలీఖాన్ ఏర్పాటుచేసిన విందులో పాల్గొనకుండానే కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ తిరిగి వచ్చారు. ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన 7వ సార్క్ ¬ంమంత్రుల సమావేశంలో పాల్గొన్న రాజ్‌నాథ్.. ఈ విందుకు హాజరుకాలేదు. సార్క్ సదస్సులో పాల్గొంటున్న విదేశీ అతిథుల గౌరవార్థం నిస్సార్ ఆలీఖాన్ ఈ విందును ఏర్పాటుచేశారు. అయితే, ఆయనే స్వయంగా ఈ విందులో పాల్గొనకుండా.. సార్క్ సమావేశం ముగిసిన వెంటనే వెళ్లిపోయారు. ఆతిధ్యం ఇస్తున్న వ్యక్తే లేకపోవడంతో రాజ్‌నాథ్ ఈ విందులో పాల్గొనరాదని నిర్ణయించారు.అనంతరం నేరుగా ¬టల్‌కు వెళ్లి అక్కడ భారతీయ ప్రతినిధులతో కలిసి రాజ్‌నాథ్ భోజనం చేశారు. అనంతరం నేరుగా ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. సార్క్ సమావేశంలో రాజ్‌నాథ్ ప్రసంగం ప్రసారం చేయకుండా పాక్ దుందుడుకుగా వ్యవహరించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, భారత్ మాత్రం ఇస్లామాబాద్‌లో రాజ్‌నాథ్ ప్రసంగం ప్రసారం కాకుండా అడ్డుకున్నారని వచ్చిన కథనాలను తోసిపుచ్చింది.




