ఉచిత విద్యుత్ కొనసాగిస్తాం
– అన్నదాతకు అండగా ఉంటాం
– ఇరు రాష్ట్రాల రైతులు బాగుండాలి
– సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,జులై 21(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న పాలమూరు-డిండి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు గురువారం సవిూక్ష నిర్వహించారు. వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరందుతుంది. క్యాంపు కార్యాలయంలో జరిగిన సవిూక్షలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, నల్గొండ, ఖమ్మం పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో పాటు నీటిపారుదలశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, భూసేకరణ వంటి అంశాలపై ప్రధానంగా ఈ సవిూక్షలో చర్చించినట్లు సమాచారం. దీనికతోడు ఈ ప్రాజెక్టులపై సుప్రీంలో వ్యాజ్యంపైనా చర్చించారని సమాచారం.




