ఉజకిస్తాన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం
తాష్కెంట్, జులై 6 (జనంసాక్షి): భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరు దేశాల పర్యటన సోమవారం ప్రారంభమైంది. రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మొదట మోదీ ఉజ్బెకిస్తాన్ చేరుకున్నారు. రాజధాని తాష్కెంట్ విమానాశ్రమంలో ఉజ్బెకిస్తాన్ ప్రధానమంత్రి షౌకత్ విూర్జియోయెవ్, మోదీకి స్వాగతం పలికారు. ఉజ్బెకిస్తాన్ సైన్యం మోదీకి గౌరవ వందనం సమర్పించింది. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో మోదీ ఆ దేశాధ్యక్షుడుతో సమావేశం కానున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి బలోపేతం చేసే కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఉజ్బెకిస్థాన్‌తో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉజ్బెక్ రాజధాని తాష్కెంట్‌లో ఆయన ఆ దేశ అధ్యక్షుడు ఇస్లాం కరిమోవ్‌తో చర్చలు జరిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ భారత్-ఉజ్బెకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నూతన శకానికి చేరుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. నార్త్-సౌత్ రవాణా కారిడార్‌తో పాటు పలు అంశాలను కరిమోవ్‌కు వివరించినట్టు మోదీ పేర్కొన్నారు.