ఉత్కంఠపోరులో కివీస్ విజయం

qaj7o3iyఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇంకా ఏడు బంతులుండగానే మూడు వికెట్ల తేడాతో కివీస్ జట్టు గెలిచింది. హామిల్టన్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఛేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు కూడా ఏడు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. దీంతో, 12 పాయింట్లతో పూల్ ఏ విభాగంలో కివీస్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఆరు మ్యాచ్ ల్లోనూ న్యూజిలాండ్ విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ లో టీమిండియాతో బంగ్లాదేశ్ జట్టు తలపడనుంది.