ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌ను వరించిన విజయం
పేలవ ప్రదర్శనతో ఓటమి తప్పించుకోలేకపోయిన ఆసిస్
ఆక్లాండ్,ఫిబ్రవరి28 : గ్రూప్ ఏలో ప్రపంచకప్ గెలుస్తారని భావిస్తున్న ఆస్టేల్రియా, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక వికెట్ తేడాతో ఆసీస్‌ను ఓడించింది. సమ ఉజ్జీల మధ్య జరిగిన ఈ పోరులో కంగారులదే పైచేయి అయ్యింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్టేల్రియా 80, 105 పరుగుల మధ్య అనూహ్య రీతిలో ఏడు వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. మొదటి పది ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చిన న్యూజిలాండ్ తర్వాత బౌల్ట్, స్పిన్నర్ విటోరీ అద్భుత బౌలింగ్ కారణంగా ఆస్టేల్రియా బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంతో పాటు వరుసగా వికెట్లు పడగొట్టటం విశేషం. ఈ ప్రపంచకప్‌లో సత్తా చాటుతారని భావిస్తున్న ఆస్టేల్రియా బ్యాట్స్‌మెన్లు బలహీనంగా న్యూజిలాండ్ బౌలింగ్‌కి లొంగిపోవడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. బౌల్ట్ తన వేగం, స్వింగ్ ద్వారా ఒక ఎండ్‌లో బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించగా.. మరో ఎండ్‌లో స్పిన్నర్ విటోరి తెలివిగా బంతుల గతిలో ఎంతో వైవిధ్యం చూపించి రెండు వికెట్లు పడగొట్టడంతోపాటు పరుగులను నియంత్రించాడు. ఫించ్, వార్నర్, మాక్స్‌వెల్, స్మిత్, కె/-టపెన్ క్లార్క్ ఎటువంటి పోరాట పటిమ చూపించకుండా పెవిలియన్ దారి పట్టారు. వికెట్ కీపర్ హాడిన్ ఆఖరి వికెట్ భాగస్వామ్యంలో 40పైచిలుకు పరుగులు నమోదు చేయటంతో ఆస్టేల్రిలియా 150 పరుగుల మైలు రాయిని దాటింది. ఇంగ్లాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ సౌథీ తన యార్కర్లను, లెగ్ కట్టర్స్, స్వింగ్ బంతులతో బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించగా.. ఈసారి ఆ పాత్రను బౌల్ట్ నిర్వహించాడు.152 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ మెక్‌కలమ్ తన విధ్వంసకర షాట్స్‌తో విజృంభించడంతో సులభంగా గెలుపు సాధ్యమని అందరూ భావించారు. కానీ ఆసీస్ బౌలర్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించి న్యూజిలాండ్‌ను ఓడించేంత పనిచేశాడు. స్టార్క్ 9 ఓవర్లలో 29 పరుగులిచ్చి 6 వికెట్లు తీయటం విశేషం. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో మెక్‌కలమ్ తర్వాత.. ఈ సీజన్‌కే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విలియమ్‌సన్ సమయోచితంగా బ్యాటింగ్ చేసి ఇంకా ఒక్క వికెట్ ఉందనగా న్యూజిలాండ్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. స్టార్క్ ఫల్‌లెన్త్ బంతులు, స్వింగ్ బౌలింగ్‌తో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లను ఏ మాత్రం కుదురుకోనివ్వలేదు. మధ్యలో అండర్‌సన్ కొంతమేర ప్రతిఘటించినా.. వికెట్లను బలిగొంటూ రావటంతో న్యూజిలాండ్ క్టిష్ట పరి/-థసితుల్లో ఇరుక్కుంది. 24వ ఓవర్‌లో కమిన్స్ వేసిన మొదటి బంతినే లాంగాన్ విూదుగా సిక్స్‌కొట్టి విలియమ్‌సన్ చావుతప్పి కన్నులొట్టపోయిన న్యూజిలాండ్‌ని గెలుపు తీరాలకు చేర్చాడు. దీంతో గ్రూప్ ఏలో తాను ఆడిన నాలుగు మ్యాచ్‌లను గెలిచి న్యూజిలాండ్ 8 పాయింట్లతో గ్రూప్ టాప్‌గా ఉంది. ఆస్గే/లియా తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక డ్రా, ఒక ఓటమితో మూడు పాయింట్లతో ఉంది.