ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
హుజూర్ నగర్ సెప్టెంబర్ 5 (జనం సాక్షి): మండల పరిధిలోని ఎంపీ యుపిఎస్ శ్రీనివాసపురం ప్రధానోపాధ్యాయులు చిక్కుల గోవింద్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రమునందు స్థానిక శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సమక్షంలో ఘనంగా సన్మానించారు. అనంతరం సన్మానం పొందిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఇలాంటి సన్మానం పొందడం ఎంతో ఆనందదాయకమని, ఈ సన్మానం పాఠశాల విధుల పట్ల మరింత బాధ్యత పెంచిందని, దానికి అనుగుణంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ మాట్లాడుతూ మండలంలో మంచిగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని ఇలాంటి గుర్తింపు కార్డు పొందడం మండలానికి గర్వకారణం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి దామోదర్, రాజశేఖర్ రెడ్డి, వడ్లానపు రామకృష్ణ, లక్ష్మీకాంత్, రేపాకుల రామకృష్ణ, జెట్టి కమల, జ్యోతి, వీరస్వామి పాల్గొన్నారు.