ఉత్తరభారతానికి లాజిస్టిక్‌గేట్‌వే..
` నోయిడాలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం
` యూపీ అభివృద్ధిలో కీలకం కాబోతుంది:ప్రధాని మోడీ
న్యూఢల్లీి,నవంబరు 25(జనంసాక్షి):ఉత్తర భారత దేశానికి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వ్యూహాత్మకంగా కీలకంగా మారనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. నార్తర్న్ ఇండియాకు లాజిస్టిక్స్ ఇది కేంద్రంగా పనిచేస్తుందన్నారు. ఢల్లీి`ఎన్సీఆర్, వెస్ట్ యూపీ ప్రజలకు ఈ ప్రాజెక్టుతో లబ్ది చేకూరనున్నట్లు ప్రధాని తెలిపారు. గత ప్రభుత్వాలు యూపీని విస్మరించాయన్నారు. బహుళజాతి కంపెనీలు తమ పెట్టుబడులకు యూపీనీ కేంద్రంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఇక్కడ అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో అంతర్జాతీయ విమానా శ్రయానికి ప్రధాని మోదీ గురువారం శంకుస్థాపన చేశారు.ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి పునాది రాయి వేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో నవంబర్ 25వ తేదీ ప్రముఖ దినంగా ఉండిపోతుందన్నారు. మద్యాహ్నం ఒంటిగంటకు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన జరిగింది. నిర్ణయించుకున్న సమయంలోనే ఇది పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టుతో వ్యాపార, పర్యాటక రంగాలకు కొత్త ఊపు అందుకుంటుందన్నారు. అలాగే అనేక రంగాలకు మధ్య అనుసంధానం పెరుగుతుంది. ఇక్కడే 40 ఎకరాల్లో ఎయిర్‌క్రాప్ట్ రిపేర్, ఓవరాల్, మెయింటేనెన్స్ కోసం నిర్మాణాలు జరగబోతున్నాయి. ఇక్కడి వందలాది మంది యువతకు దీంతో ఉపాధి లభిస్తుంది. రాజకీయాలు కాదు, మౌలికాభివృద్ధి అవసరం అని అన్నారు. గత ప్రభుత్వాలు యూపీని చీకట్లోకి నెట్టేశాయని, ఇప్పుడు యూపీకి అంతర్జాతీయ గుర్తింపు వస్తోందన్నారు. ఏడు దశాబ్దాల తర్వాత ఈ రాష్టాన్రికి మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు. నోయిడ్ విమానాశ్రయం వేలాది మంది పశ్చిమ యూపీ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని తెలిపారు. బహుళజాతి కంపెనీలు తమ పెట్టుబడులకు యూపీనీ కేంద్రంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. నోయిడ్ విమానాశ్రయం వేలాది మంది పశ్చిమ యూపీ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా జెవార్ ప్రాంతంలో 52 చదరపు కిలోవిూటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఎయిర్‌పోర్ట్‌ను 10,500 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ మొదటి విడత నిర్మాణం పూర్తి చేసుకున్న వెంటనే 1.2 కోట్ల ప్యాసింజర్ సామర్థ్యానికి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపు అంటే 2024 లోపు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.