ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముమ్మరం
డెహ్రాడూన్ : రాగల 48గంటల్లో ఉత్తరాఖండ్‌లో వర్షాలు కురిసే అవకాశముందన్న భారత వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకూ దాదాపు 30వేల మందిని రక్షించగా, దాదాపు మరో 50వేల మంది వరకూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షం కురిస్తే సహాయక చర్యలకు అటంకం ఏర్పడు తుందన్న ఉద్దేశంతో వేగవంతం చేశారు. అత్యాధునిక హెలికాప్టర్ మి-26తో పాటు 43 హెలికాప్టర్లతో యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తూ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా గత నాలుగు రోజుల నుంచి ఆహారం లేక కొండప్రాంతాల్లో చిక్కుకున్న యాత్రికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పరించి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.