ఉత్తరాఖండ్‌లో హై అలర్ట్
డెహ్రాడూన్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతూ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొండ చరియలు విరిగి పడటంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉత్తరాఖండ్ కేమినేట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అరవై మందికి పైగా మృతి చెంది ఉంటారని అనధికారికంగా తెలుస్తుంది. కాగా తెలుగువారి యోగక్షేమాలపై ఆందోళన అవసరంలేదని ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు.