ఉత్తరాఖండ్‌ వూపందుకున్న పునరావాస కార్యక్రమాలు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు వూపందుకున్నాయి. యాత్రికులను అదుకునేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని జాతీయవిపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇళ్లు కోల్పోయి నివాసం లేని వారి కోసం నెలకు రూ. 1500 చొప్పున ఆరు నెలల పాటు ఇంటి అద్దె కోసం తక్షణ సాయం అందించనున్నట్లు తెలిపింది. మొత్తం 152 గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు మార్గం లేదని…. ఫలితంగా హెలికాప్టర్ల ద్వారానే నిత్యావసరాలను సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది.