ఉత్తరాదిని కుమ్మేస్తున్న మంచు

మంచు పరదాలు కప్పుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం

డెహ్రాడూన్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు వర్షం కురుస్తోంది. జమ్మూకశ్మీర్‌తో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో శనివారం తొలకరి మంచు కురిసింది. శ్రీనగర్‌లో అనేక ప్రాంతాల్లో తొలకరి మంచు పలకరించింది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కూడా భారీ స్థాయిలో మంచు కురిసింది. స్వల్ప స్థాయిలో భక్తులు కేదారీశ్వుడిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు అందంగా మారాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు మంచుతో ఎంజాయ్‌ చేశారు. ఇక హిమాచల్‌లోని కులు, మనాలీలోనూ మంచు కురుస్తోంది. అక్కడ కూడా మంచు వల్ల పర్యాటకులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. పూంచ్‌ జిల్లాలోని మొఘల్‌ రోడ్డులో మంచు వల్ల చిక్కుకున్న 140 మందిని భారతీయ ఆర్మీ రక్షించింది. సురన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపునకు వాళ్లను తరలించారు.