ఉత్తర భారతంలో భారీ భూకంపం

g0be7fmfన్యూఢిల్లీ : ఉత్తర, వాయువ్య భారతాన్ని భూకంపం వణికించింది. దేశ రాజధాని ఢిల్లీ, కశ్మీర్, శ్రీనగర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, భోపాల్, సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్, ఛండీఘర్, జైపూర్, గుర్గావ్‌తో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నిమిషం పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూకంపం మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో సంభవించింది.

ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వతాలలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. పాకిస్థాన్‌లోనూ భారీ భూప్రకంనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. పాక్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనాలు, ఉద్యోగులు తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.

మైదాన ప్రాంతాలకు చేరుకున్నారు. మండీ హౌస్ వద్ద మెట్రో నుంచి ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. జమ్మూకశ్మీర్‌లో సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. శ్రీనగర్‌లో విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి. లాల్ చౌక్ ఫ్లైఓవర్ దెబ్బతింది. ఢిల్లీలో మెట్రో సర్వీసులను నిలిపివేశారు.