ఉత్సవాల ఏర్పాట్లు విజయవంతం అభినందనీయం
బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 07(జనం సాక్షి)
దసరా,బతుకమ్మ ఉత్సవాలకు చేసిన ఏర్పాట్లు అభినందనీయం అని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అన్నారు.
శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయం లో ఇంజనీరింగ్ అధికారులతో ఉత్సవాల ఏర్పాట్ల విజయవంతం పై నిర్వహించిన సమీక్ష సమావేశం లో మేయర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బల్దియా పరిధి లో 142 ప్రాంతాల్లో రూ. 1 కోటి 54 లక్షల వ్యయం తో ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరిగిందని,అధికారులు సమన్వయం తో దసరా,బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేశారని, కాంపౌండ్ ఏరియా పథకం లో భాగం గా బల్దియా పరిధి లో 20 యు.ఎల్.ఎస్.ఆర్ (వాటర్ ట్యాంక్)లను నిరంతర నీటి సరఫరా (24×7)కోసం ఎంపిక చేయాలని ఆదేశించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. ప్రవీణ్ చంద్ర,సి.ఎం.హెచ్.ఓ.డా.జ్ఞానేశ్ వర్,ఎం.హెచ్.ఓ.డా.రాజేష్,ఈ.ఈ.లు రాజయ్య,బి.ఎల్.శ్రీనివాసరావు,సం జయ్ కుమార్,డి.ఈ. లు,ఏ. ఈ. లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area