ఉత్సాహాన్ని నింపుతున్న జవహర్‌ బాలభవన్‌  

చిన్నారులకు ప్రత్యేక శిక్షణ
నిజమాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): జిల్లా కేంద్రంలో ఉన్న జవహార్‌ బాల భవన్‌ శిక్షణ చిన్నారులకు  కొత్త  ఉత్పాహాన్ని ఇస్తోంది. 40ఏళ్ల నుంచి జిల్లా కేంద్రంలో జవహర్‌ బాల కేంద్రం బాలలకు శిక్షణ అందిస్తుంది. మే  మొదటి వారంలో  ప్రారంభమైన  బాలల శిక్షణ కార్యక్రమాలను ప్రారంభమయ్యాయి. సుమారు 45రోజులపాటు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యం, లలిత సంగీతం, సంగీతం, జానపద గీతాలు, తబలా, మృదంగం, కీబోర్డు, హార్మోనియం, వయోలిన్‌, ఫ్లూట్‌, థియేటర్‌ ఆర్ట్స్‌, చిత్రలేఖనం, డ్రాయింగ్‌, పెయింటింగ్‌, యోగ, ఫ్లూట్‌ తదితర అంశాల్లో శిక్షణ అందించనున్నారు. ఆటాపాటలతో బాలల్లో వికాసం పెంచేందుకు ఉద్దేశించిన బాలభవన్‌ వేసవి తరగతులు చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. చిన్నారులకు చదువుతో పాటు వివిధ సాంస్కృతిక కళా రంగాల్లో శిక్షణా ఇస్తూ  వారిలో సృజనకు కృషి చేస్తున్నారు. చిన్నారులకు డ్రాయింగ్‌, టైలరింగ్‌, మ్యూజిక్‌, తబలాలో శిక్షణ శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, కరాటే, యోగ, ఫ్లూట్‌, కీబోర్డులో ట్రైనింగ్‌ ఇస్తున్నారు. ఏడాది పొడువునా  పుస్తకాలతో కుస్తీ పట్టి అలసిపోతున్న చిన్నారులు ఇక్కడ వివిధ అంశాల్లో శ్రద్ద చూపుతూ సేదదీరుతున్నారు. శాశ్వతంగా బాల భవన్‌ ఏర్పాటు అయితే ఏడాది పొడుగునా బాల బాలికలకు శిక్షణ అందించే వకాశముంటుందని నిర్వాహకులు అన్నారు. మరో వైపు వివిధ కళా నైపుణ్యాలతో చిన్నారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా  కొత్తగా కోర్పులు నేర్చుకొనే  చిన్నారుల సంఖ్య పెరుగుతోంది.  అధికారులు పూర్తి స్థాయి సౌకర్యాలు సిద్ధం చేస్తే… ఏడదంతా తరగతులు నిర్వహిస్తామని చెబుతున్నారు. ఈ దిశగా అడుగులు పడాలని కోరుతున్నారు.