ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం
ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది
మన ప్రాంతం బాగుండాలి అనుకునే వాళ్ళే విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకుంటారు
ఉద్యమసారథి, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి దిశానిర్దేశంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో అద్భుతాలను సృష్టించగలుగుతున్నాం. రాష్ట్ర ప్రగతి అప్రతిహతంగా కొనసాగుతున్నది.
నీటిని ఒడిసిపట్టుకుని దానిని వ్యవసాయ అభివృద్ధికి వాడింది కాకతీయ రాజులు.
రాష్ట్రం ఏర్పాటు తరువాత మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో సాగునీటి ముఖచిత్రం మారిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఇంజినీర్లు ప్రశంసించారు.
కంట్రోల్ బియ్యానికి ఎదురుచూసిన తెలంగాణ ఇవ్వాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నది. తెలంగాణ ఇవ్వాళ బియ్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటింది. తెలంగాణలో ఇవ్వాళ ఎటు చూసినా ధాన్యపు రాశులు.
చిన్న కమతాల వల్ల ఫార్మ్ మెకనైజేశన్ కొంచెం క్లిష్టం. ఉబరైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ రావాలి. దాని దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినం. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు రావాలి. వాటిని రాష్ట్రం తరఫున ప్రోత్సహిస్తాం. వ్యవసాయ ఎగుమతులు ప్రోత్సహిస్తాం.
ఫుడ్ ప్రాసెసింగ్ మీద దృష్టి పెట్టినం. ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు మొదలైనాయి.
అన్ని పంటలకు అవసరమైన భూములు, వాతావరణం తెలంగాణ లో ఉన్నాయి. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తుంది. నూనెల దిగుబడుల మీద కేంద్రం పెట్టే లక్షల కోట్ల రూపాయలు దేశీయ రైతులకు ఇస్తే, నాలుగేళ్లలో వంట నూనెల్లో స్వయం సమృద్ది సాధించగలం.
ముందు చూపు లేని కేంద్రం వల్లనే బియ్యం విషయంలో గందరగోళం నెలకొంది. ఆరు నెలల ముందు మా వద్ద సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయన్న కేంద్రం, ఇప్పుడేమో నిల్వలు లేవని ఎగుమతులు నిషేధం విధించింది.
తెలంగాణలో ఇవ్వాళ జీవ వైవిధ్యం తొణికిసలాడుతోంది. ఏ ఊరికి పోయినా టన్నుల కొద్ది చేపలు, రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో గొర్రెలు, కోళ్లు. తెలంగాణ గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించాయి.
తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాల్లో గత తొమ్మిదేళ్ళలో గమనార్హమైన మార్పు వచ్చింది.. తెలంగాణకు బలమైన పునాది పడింది.
మరోసారి కేసీఆర్ గారికి, మన ప్రభుత్వానికి మీ ఎన్నారైల ఆశీర్వాదం కావాలి. మీరు బుద్ధి జీవులు.. ఆలోచించాలి. దుష్ప్రచారాన్ని తుత్తునియలు చేయాలి.
తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో సదా ఎన్నారైల తోడ్పాటు అవసరం
అమెరికా పర్యటనలో నాలుగో రోజు వాషింగ్టన్ డీసిలో తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలు జయంత్ చల్లా, భువనేష్, రవి పల్లా, ఈశ్వర్ బండా తదితరులు