ఉద్యమస్పూర్తితో ఎదుర్కొంటాం

రాష్ట్రంలో 24 గంటల జనతా కర్న్యూ నేటి ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటలకు వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలి – కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి • ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావద్దు ఎక్కడి వారు అక్కడే ఉండిపోదాం – తెలంగాణ ఐక్యతను చాటడంలో ముందుందాం రవాణా వ్యవస్థలన్నీ బంద్ చేస్తున్నాం . అత్యవసర పరిస్థితుల కోసం అందుబాటు రవాణా మహారాష్ట్ర సరిహద్దులను మూసేసే ఆలోచన • విదేశీయులకు స్వీయనిర్భందం తప్పనిసరి ప్రధాని పిలుపు మేరకు సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో ఐక్యత చాటుదాం ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపు
హైదరాబాద్,మార్చి 21(జనంసాక్షి): తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివా రం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉద యం 6 గంటల వరకు జనతా కర్వ్యూ లో పాల్గొనా లన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అంతా ఐక్యత చాటుదామని అన్నారు. ఆదివారం తెలంగాణలో ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్నీ సేవలు బంద్ చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ, మెట్రో సేవలు బంద్ అని అన్నారు. అత్యవసరం కోసం డిపోకు ఐదు ఆర్టీసీ బస్సులు, ఐదు మెట్రో రైళ్లు నడుస్తాయన్నారు. దుకాణాలు, వైన్స్ షాపులు బంద్ చేయాలని ఆదేశిం చారు. మహారాష్ట్రలో వ్యాధి తీవ్ర పెరుగుతున్నందన బార్డర్‌ను మూసివేసే ఆలోచన చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా ఆపేస్తా మన్నారు. మాల్స్, షాపులు కూడా మూసేయా లన్నా రు. ఆస్పత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రో బంక్ లు, మీడియా సిబ్బందికి బంద్ నుంచి మిన హాయింపునిస్తున్నట్లు ప్రకటించారు. 24 గంటలు కర్ప్యూ పాటించి యావత్ దేశానికి ఆదర్శంగా నిలు ద్దామన్నారు. తెలంగాణ ఐక్యతను చాటేలా దేశానికి ఆదర్శంగా నిలుద్దామని అన్నారు. కరోనా బంద్ నేపథ్యంలో ప్రగతి భవన్లో సిఎం కెసిఆర్ మిడి యాతో మాట్లాడారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుని చ్చిన జనతా కర్ప్యూకు అందరూ సహకారం అందిం చాలని కెసిఆర్ కోరారు. ఆదివారం ఉదయం 6 గంటలనుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24గంటల పాటు కర్ఫ్యూ కొనసా గుతుందని తెలిపారు. వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెం దిన బస్సులను రాష్ట్రంలోకి లా మసులకు కరోనా వైరస్ దేశంలో ఎవరిని ఏం చెన్నై శ్రీ గంటలు పాటించి దేశానికే ఆదరులకు ఉన్నారు. ఆరో కర్ఫ్యూని 1 గంటలు ఆమంజు మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రాం జ 24 – ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ పిలుపు అనుమతివ్వమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. షాపులు, మాల్స్ స్వచ్చందంగా మూసివేయాలన్నారు. వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయం 7నుంచి రాత్రి 9 గంటల వరకు అని ప్రధాని పిలుపునిచ్చినా తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూని 14గంటలు కాకుండా 24 గంటలు పాటించి దేశానికే ఆదర్శంగా నేలా మసులుకుందామన్నారు. రాష్ట్రంలో అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే పనిచేయనున్నట్లు తెలిపారు. మిగతా వారంతా ఎవరికి వారే స్వచ్చందంగా బంద్ పాటించాలన్నారు. ఇది ఒక కఠిన సమయమని, సంకట స్థితి అని, స్వయం నియంత్రణ పాటించాలన్నారు. అందరం కలిసి పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదన్నారు. స్వీయ నియంత్రణ మనల్ని కాపాడుతదన్నారు. మన కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన ప్రపంచం కోసం అందరం కలిసి జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందామన్నారు. రేపు ఏం జరుగుతందో తెలియదు. ఎలా ఉంటుందో తెలియదు. ఎలాంటి కఠిన పరీక్షనైనా ఎదుర్కొంటామని అన్నారు. అసవరమైతే ప్రజలకు నేరుగా నిత్యావసరాలు పంపిణీ చేస్తామన్నారు. ఎక్కడైతే నియంత్రణ పాటించలేదో వైరస్ అక్కడ బాగా విస్తరించిందన్నారు. ఎవరికివారే స్వీయ నియంత్రణ పాటిస్తే రాష్ట్రానికి, దేశానికి సేవ చేసినట్లేనని సీఎం అన్నారు. వైరస్ ఎక్కువగా 60 ఏండ్ల పైబడిన వాళ్లు, 10 ఏండ్ల లోపు పిల్లలకు ప్రాణాంతకంగా ఉంటున్న నేపథ్యంలో వారిని బయటకు రాకుండా చూసుకోవాలన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు. ఈ సందర్భంగా జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రధాని పిలుపు మేరకు సాయంత్రం 5 గంటలకు అందరూ ఇళ్ల బయటికి వచ్చి చప్పట్లు కొట్టాలని అన్నారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపును కొందరు అవహేళన చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది పనికిమాలిన వెధవల పని అని అన్నారు. అలాంటి వారిని గుర్తించి అరెస్ట్ చేయాలన ఇసిఎం కెసిఆర్ డిజిపిని ఆదేశించారు. సాయంత్రం 5 గంటలకు నేను కూడా కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వచ్చి చప్పట్లు కొడతాను. చప్పట్లు కొట్టి మన ఐక్యతను చాటి చెప్పాలి. సాయంత్రం 5 గంటలకు సైరన్ మోగిస్తాం. సైరన్ మోగగానే బయటికి వచ్చి 4 నిమిషాలు చప్పట్లు కొట్టాలి ‘ అని తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ పిలుపునిచ్చారు. కరోనా ఉధృతి ఎక్కువైతే ఇంటింటికి రేషన్ పంపేందుకు యోచిస్తున్నాం. ఎన్ని వేల కోట్లయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ నుంచి టెస్టింగ్ పరికరాలు, మాన్లు వచ్చాయి. సమస్య తీవ్రమైతే మనం ముందుగా వైద్యుల్ని కాపాడుకోవాలి. వారు చేస్తున్న సేవలను అభినందించారు. వారి ఆరోగ్యాలకు భంగం రాకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. మీడియా సమావేశంలో మంత్రులు, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాల్సిందే కరోనా విషయంలో కరీంనగర్‌లో కలకలం రేగిన నేపథ్యంలో అక్కడకి వచ్చిన విదేశీయులను గుర్తించి పట్టుకున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి మరీ వైద్యబృందాలు కరోనా పరీక్షలు చేరని కేసీఆర్ అన్నారు. కరీంనగర్ వచ్చిన 10 మంది ఇండోనేషియ న్లకు లక్షణాలు ఉన్నాయని.. ఉన్నతాధికారులు పక్క రాష్ట్రాలతో నిరంతరం టచ్ లో ఉన్నారని సీఎం తెలిపారు. ఇండోనేషియన్లు తప్పు చేయలేదని.. కేంద్రం అనుమతి ఇస్తేనే వచ్చారన్నారు. కరోనా లక్షణాలు ఉంటే 100శాతం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారెవరైనా స్వచ్చందంగా తమ రాకను తెలియచేయాలన్నారు. ఇది వారికి, దేశానికి మంచి దన్నారు. కటుంబ సభ్యులుకూడా సమాచారం ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. పొరుగు దేశాల నుంచి ఎవరూ రాష్ట్రంలోకి వచ్చినా కచ్చితమైన పరీక్షలు చేయించుకోవాల్సిందేనని, తప్పించుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు పట్టుకుంటారని తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు చేశాం. అయితే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలకు అసౌకర్యం కలగొద్దని కరీంనగర్ పర్యటన వాయిదా వేసుకున్నాను. ఇండోనేషియన్లు ఎక్కడెక్కడ తిరిగారో విచారణ చేస్తున్నాం. ఎయిర్పోర్టులు, పోర్టులు మూసివేయాలని ప్రధానికి చెప్పాను. . ఒకేసారి మూసివేయడం కూడా సాధ్యం కాదు. తెలంగాణ పేద రాష్ట్రం కాదు.. అవసరమైతే పేదలకు సరుకులు ఉచితంగా అందిస్తాం. నేను బతికున్నంత వరకు పేదలకు కష్టం రానివ్వను. నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కేసీఆర్ ఒకింత వార్నింగ్ ఇచ్చారు. కేవలం 24 గంటలు ఇళ్లకు పరిమితం కావాలని, దీనిపై తెలంగాణ ప్రజలు నిక్కచ్చిగా వ్యవహరించాలని కోరారు. పరిస్థితి చేయిదాటితే మొత్తం షట్ డౌన్ చేస్తామని కూడా కెసిఆర్ స్పష్టం చేశారు. ఇకపోతే భక్తులకు అనుమతి లేకున్నా ఆలయాల్లో నిత్యపూజలు కొనసాగుతున్నాయన్నారు. అవసరమైతే తీవ్ర పరిస్తితులే వస్తే ఖర్చుకు వెనకాడకుండా నిత్యావసర సరుకుల్ని ప్రభుత్వమే ఇంటింటికి సరఫరా చేస్తుందన్నారు. –

తాజావార్తలు